
– సభకు హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– వివరాలు వెళ్ళడించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ – ఆమనగల్
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిజినపల్లి వద్ద నిర్వహిస్తున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని కల్వకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ముందుగా పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. అనంతరం బిజినిపల్లి వద్ద నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావుతో పలువురు మంత్రులు హాజరు అవుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే బహిరంగ సభకు నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు, మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.