కస్తూర్బా గాంధీ  గురుకుల విజయ దుందుభి

నవతెలంగాణ – చండూర్
స్థానిక కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయంలో  2023- 24 విద్యా సంవత్సరానికి సంబంధించి పదవ తరగతి ఫలితాలలో విద్యార్థులు  100%  ఉత్తీర్ణత సాధించడమే కాకుండా 9.5,9.2 హైయెస్టు  జీపీ  లతో జిల్లాలోని అన్ని కేజీబీవీలలో మూడో స్థానంలో నిలిచి విజయ దుందుభి మ్రోగించారు.ఈ పదవ తరగతి ఫలితాలలో డి.ఇందు 9.5 జిపి సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, వి . అంజలి 9.2 జిపి తో ద్వితీయ స్థానంలో నిలిచింది.ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా సాధించిన ఈ ఫలితాలను చూసి విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేసినట్లు  కేజీబీవీ   ప్రత్యేక అధికారి సి.హెచ్.మంజుల తెలిపారు . ఈ సందర్భంగా   సి.హెచ్. ఆమె   మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు అయినప్పటికీ,ప్రభుత్వం ద్వారా పాఠశాల అందించిన వనరులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఇలాంటి మంచి ఫలితాలు సాధించారు.  పాఠశాల సిబ్బంది సహకారం తో టీం వర్క్ చేయడం వల్లనే  ఈ విజయాన్ని సాధించగలిగామని తెలిపారు.