
నల్గొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రం లోని కస్తూర్బా గాంధీ పాఠశాలను జిల్లా విద్యాశాఖాధి కారి బొల్లారం బిక్షపతి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అమ్మ ఆదర్శపాఠశాల పనులను,పరిసరాలు, వంటగది, స్టోర్ రూమ్ మరియు బాత్రూంలను, తరగతి గదులు పరిశీలించారు. విద్యార్ధినిలతో మాట్లాడుతూ.వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సురక్షిత మంచి నీళ్ళు వస్తున్నాయా అని వారిని అడగ్గా వస్తున్నాయని బదులిచ్చారు. మీరు బాగా చదువుకోవాలని విద్యార్థినులకు డీఈఓ భరోసా కల్పించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ కూరగాయలు, పప్పులు,బియ్యం శుభ్రంగా ఉంచాలని మన
ఇంట్లో పిల్లలను ఎలాగైతే శ్రద్ధగా చూసుకుంటామో ఇక్కడ ఉన్న పిల్లలను కూడా మీ పిల్లలుగా భావించి అంతే జాగ్రత్తగా చూసుకోవాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ మెనూ ప్రకారం శుచి అయిన పౌష్ఠిక ఆహారం అందించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల కాలం పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని,ప్రభుత్వం విద్యార్థినిలకు నాణ్యమైన విద్య, వసతి, పౌష్ఠిక ఆహారం అందిస్తోందని, విద్యార్థినిల విద్యా ఆరోగ్యం పట్ల రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు.ఈయన వెంట ఎంఈఓ లావూరి బాలు నాయక్, ఎస్ఓ, ఉన్నారు.