
మండలంలోని మల్యాల గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కె .గంగాధర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలో వంటగదిని, మరుగుదొడ్లు, మూత్రశాలను, పాఠశాల పరిసరాలను పరిశీలించారు.వంటగదిలో నిలువ ఉన్న కూరగాయలను, ఆహార ధాన్యాల నాణ్యతలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు.తర్వాత సందర్శించిన ఆయన విద్యార్థులతో ముచ్చటించారు.అనంతరం అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి రోగులకు అందుతున్న అన్ని రకాల సేవలను పరిశీలించారు. పలు ఆవరణంలోనూ మొక్కలు నాటారు.ఆయన వెంట ఎంపీడీవో రాజా త్రివిక్రమ్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.