కస్తూర్భా పాఠశాలను,బాలుర వసతి గృహాన్ని పరిశీలించిన మెడికల్ ఆఫీసర్

నవతెలంగాణ-ఏర్గట్ల
మండలకేంద్రంలోని కస్తూర్భా పాఠశాలను,బాలుర వసతి గృహాన్ని సోమవారం మెడికల్ ఆఫీసర్ రక్షిత  సందర్శించారు.పాఠశాల లోని, తరగతి గదులు, వంట గది,మూత్రశాలలను పరిశీలించారు.విద్యార్థులు తీసుకునే ఆహారాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని,వారు తీసుకునే ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని కస్తూర్భా పాఠశాల అధికారిణికి,వసతి గృహాధికారికి సూచించారు.చలి కాలంలో విద్యార్థులు జ్వరాలు,వివిధ రోగాల బారిన పడే అవకాశం ఉందని,వారిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్.ఓ సంధ్యారాణి, బాలుర వసతి గృహధికారి సంతోష్, హెల్త్ అసిస్టెంట్ పండరి, తదితరులు పాల్గొన్నారు.