తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో ఆన్ లైన్ సేవలు అందిస్తున్న కామన్ సర్వీస్ సెంటర్స్ విఎల్ ఇ సోసైటిలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేయబోయే మీ సేవా కేంద్రాలను సూర్యాపేట జిల్లా లో తమ సెంటర్ లకు కేటాయించాలని సీఎస్ సీ విఎల్ సొసైటీ ప్రెసిడెంట్ కస్తూరి నాగరాజు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం సొసైటి సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కు ప్రజావాణి లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ కేంద్రాల ద్వారా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అనేక రకాల పౌర సేవలు ఆయుష్మాన్ భారత్, ఇ కెవైసి, ఆర్దిక సర్వే, ఈ శ్రమ్ కార్డులు వంటి సేవలు అందిస్తున్నామని తెలిపారు. నూతనంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో మీ సేవా కేంద్రాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని వారు తెలిపారు. ఇప్పటికే గ్రామాలలో డిజిటల్ సేవలు సేవలు అందిస్తున్న తమకు మీ సేవా కేంద్రాలు కేటాయించాలని జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సీ విల్ సొసైటీ ఉపాధ్యక్షులు ధరావత్ హరిప్రసాద్, సహాయ కార్యదర్శి తాడూరి లింగయ్య, రాంపాక అభినవ్, జలగం శివ గౌడ్, దైద సురేందర్, మాధవరావు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.