– చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ఉన్న బాలికల కస్తూరిబా పాఠశాల భవనాన్ని పరిశీలించి స్లాబ్ పనుల మరమ్మతులు గురువారం పరిశీలించారు.మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు పాఠశాలలో నెలకొన్న తాగునీటి,డ్రైనేజీ సమస్యలు పాఠశాల స్లాబ్ మరమ్మతుల పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.పాఠశాల అంతా కలియ తిరుగుతూ విద్యార్థులతో మాట్లాడి ఇంకేమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని వెన్ రెడ్డి రాజు చెప్పారు. త్వరతిగతిన యుద్ధ ప్రతిపాదికన పనులు పూర్తిచేయాలని మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈ బాలచందర్ స్థానిక కౌన్సిలర్ సుల్తాన్ రాజు కస్తూరిబా పాఠశాల ప్రిన్సిపల్ భవాని తూర్పునూరి రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు