
కల్లు గీసేందుకు తాటి చెట్లు ఎక్కే గౌడన్నలకు కాటమయ్య కిట్లు ఎంతో రక్షణ గా ఉంటాయని కాటమయ్య రక్ష సెప్టి కిట్ రాష్ట్ర కో అర్డినేటర్ బెల్లం కొండ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మండలంలోని బాదం పెల్లి గ్రామo లో ఇందన్ పెల్లి, కిష్టాపూర్, జన్నారం, పొనకల్ గ్రామాలకు చెందిన గీతా కార్మికులకు లక్సట్టిపేట్ ఎక్సజ్ సీ ఐ సమ్మయ్య ఆధ్వర్యంలో కాట మయ్య రక్ష సెప్టి కిట్లతో ప్రత్యేక ట్రైనర్ల తో శిక్షణ ఇప్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అక్కడి గీతా కార్మికులు తాటి చెట్లు ఎక్కేందుకు ఊపయోగిస్తున్న రక్షణ కిట్ల ను పరిశీలించిన తర్వాత కిట్ల పై నిపుణులను సంప్రదించి ప్రభుత్వం వీటిని తయారు చేసిందని అన్నారు. తాటి చెట్టు ఎక్కేటప్పుడు గాని దిగేటప్పుడే గాని ప్రమాదం జరగకుండా ఉంటుందని అన్నారు.గీతా కార్మికులందరికి శిక్షణ అనంతరం రక్షణ కిట్ల ను అందజేస్తామని తెలిపారు. ఈ కార్య క్రమములో ఎక్సజ్ ఎస్ ఐ మౌనిక, బాదంపెల్లి గౌడ సంఘం అధ్యక్షులు నాయిని సత్యాగౌడ్, మండల గౌడ సంఘo అధ్యక్షులు మూల భాస్కర్ గౌడ్, ప్రధాన కార్య దర్శి పోడేటి రవి గౌడ్, గౌడ సంఘం జిల్లా నాయకులు బాలసాని శ్రీనివాస్ గౌడ్, పోడేటి శ్రీనివాస్ గౌడ్, ఒల్లలా నర్సాగౌడ్, మండల గౌడ సంఘం మాజీ అధ్యక్షులు పరకాల తిరుపతి గౌడ్, వివిద గ్రామాల నుండి వచ్చిన గౌడ కులస్తులు పాల్గొన్నారు