నవతెలంగాణ -తాడ్వాయి
ఫిబ్రవరి 28 నాడు జరిగే సైన్స్ టాలెంట్ టెస్ట్ లను పురస్కరించుకొని శుక్రవారం మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో ఆన్లైన్ ద్వారా సైన్స్ టాలెంట్ టెస్టులను ఎంఈఓ రేగ కేశవరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో మండలంలోని కాటాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల చెందిన విద్యార్థులు పి ఎబిలైజర్ కు ప్రథమ బహుమతి, ఎస్.కె నిజాముద్దీన్ అనే విద్యార్థికి ద్వితీయ బహుమతి, టి అస్మిత కేజీబీవీ పాఠశాలకు చెందిన విద్యార్థినికి తృతీయ బహుమతి గెలుపొందారు. ప్రతిభ కనబరిచిన సైన్స్ టాలెంట్ టెస్ట్ లో ప్రధమ, ద్వితీయ రెండు బహుమతులు సాధించి ప్రతిభ కనబరిచిన కాటాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల విద్యార్థులకు, ఎంఈఓ రేగ కేశవరావు, ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రేగ కేశవరావు మాట్లాడుతూ సైన్స్ లో ఉత్తమ ప్రతిభ ను వెలికితీయడంలో భాగంగా నిర్వహించిన ఆన్లైన్ సైన్స్ టాలెంట్ టెస్టులో ప్రధమ ద్వితీయ బహుమతులు పొందడం ఎంతో అభినందనీయమని, వీరు ఇంకా జిల్లా రాష్ట్రస్థాయిలో కూడా ప్రతిభ కనబరిచి ఉత్తమ విద్యార్థులుగా విజేతలుగా నిలవాలని మన మండలం పేరు రాష్ట్రస్థాయిలో ఉంచుతారని ఆకాంక్షించారు. ప్రధానోపాధ్యాయులు బాణాల సుధాకర్, సైన్స్ సబ్జెక్టు టీచర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రేగ కేశవరావు, ఉపాధ్యాయులు సక్రు నాయక్, భుజంగరావు చంద్రారెడ్డి శ్రీదేవి సుజాత లక్ష్మయ్య రమేష్ తదితరులు పాల్గొన్నారు.