కథే హీరోగా సినిమాలు తీస్తా..

'నేనొక ఫిల్మ్‌ ఫైనాన్షియర్‌ని. సినిమా మీద ప్యాషన్‌తో నిర్మాతగా మారాను. అయితే మహాబలిపురంలో ఉన్న నా 10 ఎకరాల స్థలాన్ని ఒకరికి తెలియకుండా‘నేనొక ఫిల్మ్‌ ఫైనాన్షియర్‌ని. సినిమా మీద ప్యాషన్‌తో నిర్మాతగా మారాను. అయితే మహాబలిపురంలో ఉన్న నా 10 ఎకరాల స్థలాన్ని ఒకరికి తెలియకుండా మరొకరికి.. ఇలా పలువురు వ్యక్తులకు అమ్మానని నాపై కేసు పెట్టారు. 14 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశాను. అది తప్పుడు కేసు అని న్యాయస్థానం నన్ను నిర్దోషిగా తేల్చింది. తప్పుడు కేసులు కోర్టు ముందు నిలబడవు. నా న్యాయపోరాటం గెలిచింది’ అని నిర్మాత శింగనమల రమేష్‌ బాబు అన్నారు. పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబుతో ‘కొమరంపులి’, ‘ఖలేజా’ లాంటి భారీ బడ్జెట్‌ చిత్రాలను నిర్మించిన ఆయన ఓ కేసు నిమిత్తం 14 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు ఇటీవల ఆయన్ని నిర్దోషిగా తేల్చి, కేసు కొట్టి వేసింది. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం మీడియాతో సంభాషించారు. నాపై కేసు పెట్టిన వారిపై నాకు ఎలాంటి కక్ష సాధింపులు లేవు. ఏదైనా న్యాయపరంగానే పోరాటం చేస్తా. సినిమా నాకు తల్లి లాంటిది. భవిష్యత్తులోనూ ఇదే రంగంలో కొనసాగుతా. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరూ హీరోలుగా చేశారు. హిట్స్‌ అందుకున్నారు. ఇప్పుడు డైరెక్షన్‌ చేయాలని అనుకుంటున్నారు. నేను కూడా మంచి కథాబలం ఉన్న సినిమాలను నిర్మాతగా నిర్మిస్తా. అలాగే ఇతర సినిమాలకు ఫైనాన్షియర్‌గానూ చేస్తాను. అప్పట్లో సినిమాలు ఆరు నెలలు లేదా సంవత్సరంలోగా పూర్తయ్యేవి. కానీ నా దురదష్టం కొద్ది నేను తెరకెక్కించిన రెండు పెద్ద హీరోల చిత్రాలు దాదాపు మూడేళ్ల సమయం చిత్రీకరణలోనే గడిచిపోయింది. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఆ రెండు చిత్రాలకు రూ.100 కోట్ల వరకూ నష్టపోయా. మేము సంపాదించింది ఫైనాన్స్‌ బిజినెస్‌ వల్లే. నాన్న నుంచి అది నాకు వచ్చింది. అయితే సినిమా మేకింగ్‌ అనేది ఎప్పటికీ ఓ జూదమే. ఆ గ్యాంబ్లింగ్‌ కారణంగానే నాకు రెండు సినిమాల్లో వందకోట్లు పోయింది. ఆ టైమ్‌లోనే కాదు జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఏ హీరో కూడా నన్ను పలకరించలేదు. అయితే ప్రజెంట్‌ సినిమా నిర్మాణం బావుందని వింటున్నాను. నిర్మాతకు పది రూపాయలు మిగులుతాయని అంటున్నారు. అయితే 24 క్రాఫ్ట్స్‌ మన గ్రిప్‌లో ఉన్నప్పుడే సినిమా తీయాలి. ఇదే నా జర్నీలో నేర్చుకున్న గుణపాఠం. త్వరలో ఓ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌మెంట్‌ ఉండే అవకాశం ఉంది.