బాధిత కుటుంబానికి కత్తి కార్తీక పరామర్శ 

Kathi Karthik's condolences to the victim's familyనవతెలంగాణ – దుబ్బాక రూరల్
దుబ్బాక మండలం గంభీర్పూర్  గ్రామానికి చెందిన పసుపునూరి లక్ష్మి (65) అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ శనివారం వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా అధైర్యపడొద్దనీ బాధిత కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు చింతూ మైసయ్య, గంభీర్ పూర్ రైతు సమన్యయకర్త అధ్యక్షులు నేరటి నరసింహులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త దేవి రెడ్డి, చేపూరి స్వామి గౌడ్,జానీ, యాద రమేష్, పోతరాజు చిరంజీవి తదితరులు ఉన్నారు.