బాధిత కుటుంబానికి కత్తి కార్తీక పరామర్శ 

నవతెలంగాణ- దుబ్బాక రూరల్ 
దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి  గ్రామానికి చెందిన బిట్ల పుత్రయ్య (50) ఇటీవల  అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీక  గురువారం మృతుడి  కుటుంబ సభ్యులు కలిసి పరామర్శించారు.  అనంతరం ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కొత్త దేవి రెడ్డి దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, గుడిసెల ఆమోస్, రెడ్డిబోయిన శ్రీనివాస్, బిట్ల భాస్కర్ “టిపిసిసి మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ” కర్నల్ శ్రీనివాసరావు, మిద్దె భూపాల్ గౌడ్ (సిద్దిపేట జిల్లా సేవాదళ్ కార్యదర్శి), అశోక్ గౌడ్, శేఖరం, ఐరేని సాయి తేజ గౌడ్, మంచాల మల్లేశం (కాంగ్రెస్ సీనియర్ నాయకులు) తదితరులు పాల్గొన్నారు.