పలు కుటుంబాలకు కత్తి కార్తీక పరామర్శ 

Kathi Kartika Paramarsha for many familiesనవతెలంగాణ – దుబ్బాక రూరల్
ఇటీవల అక్బర్ పేట్ భూంపల్లి మండల పరిధిలోని రామేశ్వరంపల్లి  గ్రామానికి చెందిన ఆకుల శంకర్ గౌడ్ లత దంపతులు  పాముకాటుకు గురై అనారోగ్యం పాలయ్యారు. అలాగే అదే గ్రామానికి చెందిన పల్లె సుదర్శనం , చిన్న నిజాంపేట గ్రామానికి చెందిన కీసర రాజవ్వ లు గత కొన్ని రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం పలువురి ద్వారా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక గౌడ్  తెలుసుకునీ బుధవారం బాధితులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ధైర్య పడద్దని వారికి భరోసా కల్పించారు. కార్యక్రమంలో అక్బర్ పేట్ భూంపల్లి  మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ కైలాసం, గ్రామ అధ్యక్షుడు శ్యామ్ రవి, గ్రామ ఉపాధ్యక్షుడు కుమార్, సీనియర్ నాయకులు కొత్త దేవి రెడ్డి మహేందర్ గౌడ్  తదితరులు ఉన్నారు