నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ ను ఆయన నివాసంలో సోమవారం తెలుగుదేశం పార్టీ అశ్వారావుపేట నియోజక వర్గం నాయకులు కట్రం స్వామి దొర మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయాలు,ప్రత్యేకంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు బాగానే ఉంటుందని ఇదే విషయం అయి ఆంధ్రాలో సైతం చర్చిస్తున్నారు అని ఆయన అన్నారు.