కాట్రేవు-మల్లారెడ్డిగూడెం హై లెవెల్ వంతెనను ప్రారంభించిన రాజగోపాల్ రెడ్డి

నవతెలంగాణ- చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం కాట్రేవు గ్రామంలో 1కోటి18 లక్షల నిధులతో నిర్మించిన కాట్రేవు-మల్లారెడ్డిగూడెం హై లెవెల్ వంతెనను బుధవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో 50 లక్షల నిధులతో గొర్రెల మార్కెట్ షెడ్డును ప్రారంభించారు. ఎల్లంబాయి, కైతాపురం గ్రామపంచాయతీల కార్యాలయ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మునుగోడు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఎంపీపీ, జడ్పిటిసి తాడూరి వెంకట్ రెడ్డి, చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి, రాజు, మండల సర్పంచుల, ఫోరం మండల అధ్యక్షులు, మునగాల ప్రభాకర్ రెడ్డి, సర్పంచులు, బచ్చ రామకృష్ణ, గుర్రం కొండయ్య, గుడ్డేటి యాదయ్య చౌటుప్పల్ బ్లాక్ మండల పట్టణ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, బోయ దేవేందర్, సుర్వి నరసింహ గౌడ్, ఉపసర్పంచ్ బోయ యాదయ్య, నాయకులు, మునగాల తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.