
మునుగోడు మండలంలోని కల్వకుంట్ల గ్రామానికి చెందిన కట్ట లింగస్వామి ని డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శిగా ఈనెల 24, 25 న చిట్యాల మండల కేంద్రంలో జరిగిన డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు , జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఏకగ్రీవంగా జిల్లా కమిటీ ఎన్నుకున్నారు . ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన లింగస్వామి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు యువత, నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయాలని అన్నారు . ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు నిరుద్యోగ యువత తో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. తమ నియామకానికి సహకరించిన జిల్లా మండల సభ్యులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలోని ప్రతి గ్రామ గ్రామాన సంగం ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు.