త్వరలో బీఆర్‌ఎస్‌ గూటికి కౌశిక్‌ హరి..

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రామంగుండం శాసనసభా నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్‌ నేత కౌశిక్‌ హరి త్వరలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఆయన మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుతో భేటీ అయ్యారు. గులాబీ పార్టీలో చేరేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్‌, బాల్క సుమన్‌ ఉన్నారు.