
నవతెలంగాణ జమ్మికుంట:
జమ్మికుంట మండలం లోని సైదాబాద్ గ్రామంలో నివసిస్తున్న ఇండ్లు లేని నిరుపేదలకు లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎనిమిది సంవత్సరాలు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ సమస్యను పరిష్కరించలేకపోయాడని ఆయన విమర్శించారు. ఎమ్మెల్సీగా వచ్చిన సంవత్సరంలోనే మీ అందరికీ ఇళ్ల పట్టాలు అందజేయడం జరిగిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో సైదాబాద్ ప్రజలందరూ ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సైదాబాద్ గ్రామ సర్పంచ్ పుప్పాల శైలజ రాజారాం, జెడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్, మండల తహసిల్దార్ రజనీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.