కౌశిక్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి

Kaushik Reddy should apologize publicly– కొంపెల్లి శ్రీనివాసరెడ్డి ఐ ఎన్ టి యు స జిల్లా అధ్యక్షులు
నవతెలంగాణ – గోవిందరావుపేట
అసెంబ్లీలో అహంకారంతో మంత్రి సీతక్క పై దురుసుగా మాట్లాడిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రజల సమక్షంలో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఐఎన్ టి యుసి ములుగు జిల్లా అధ్యక్షుడు కొంపెల్లి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో  ఐ ఎన్ టి యు సి కాంగ్రెస్ కార్యకర్తలు అత్యవసరంగా సమావేశమై కౌశిక్ రెడ్డి పై కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని లేకుంటే ప్రజలే తగిన పాఠం చెబుతారని అన్నారు. ఒక మహిళ మంత్రిపై దురుసుగా మాట్లాడడం ప్రజానీకం క్షమించరని అన్నారు. తొలిసారి ఎమ్మెల్యేగ ఎన్నికైన కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడాలో అర్థం కాని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. తనను గెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని మీడియా సమావేశంలో మాట్లాడిన కౌశిక్ రెడ్డి ఇతరులపై ప్రధానంగా ప్రజాసేవకురాలు అయినా సీతక్కపై అసెంబ్లీలో మాట్లాడిన తీరును పార్టీలు ప్రజాస్వామికవాదులు ఇప్పటికే తీవ్రంగా ఖండించారని అన్నారు. అసెంబ్లీలో అపాలజీ చెప్పిన కౌశిక్ రెడ్డి సరిపోదని బహిరంగంగా ప్రజల సమస్యలు క్షమాపణ చెప్పాలని లేకుంటే ప్రజల చేతిలో శిక్ష తప్పదని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాం నాయక్ , యూత్  కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి, ఎంపీటీసీ గుండెబోయిన నాగలక్ష్మి-అనిల్ యాదవ్, జిల్లా కార్యదర్శి గణపాక  సుధాకర్ , కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి జంపాల ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షులు పాశం మాధవరెడ్డి , మాజీసర్పంచ్ మేకల సుదర్శన్, సమ్మిరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.