నవతెలంగాణ – కంటేశ్వర్
ఎమ్మెల్సీ కౌశికా రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని కులం పేరుతో దూషించిన అతన్ని ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించాలని నిజామాబాద్ జిల్లా ముదిరాజ్ బాంధవులు ఆదివారం ప్రకటనలో తెలియజేస్తూ నిరసన కార్యక్రమాలను చేపడతామన్నారు. కౌశికరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, కులం పేరుతో దూషించిన అతనిని ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం అనగా నేడు 26-6-2023, రోజు జిల్లాలోని అన్ని మండలాల్లో నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నియోజకవర్గ ఇంచార్జీ, మండల అధ్యక్షులు , గ్రామ పెద్దలు, అధ్యక్షులు అందరికీ మనవి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కరాటే రమేేష్ కుమార్ ముదిరాజ్ తెలంగాణ రాష్ట్ర ముదిిరాజ్ మహాసభ నిజామాబాద్ పక్షాన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే నిరసన దీక్షలో ప్రతి ఒక్క ముదిరాజ్ బిడ్డ హాజరుకావాలని పిలుపునిచ్చారు. మనం అంటే ఏమిటి మన కులం అంటే ఏమిటి అనే నినాదాన్ని నేడు నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముదిరాజ్ మహాసభ కులస్తులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అని అన్నారు.