కౌటాల జాతర కరపత్రాలు ఆవిష్కరణ

నవతెలంగాణ- మల్హర్ రావు
కుమరంబిం, అసిపాబాద్ జిల్లా కౌటాలలోని కంకలమ్మ గుట్టలో ఈ నెల 10 నుంచి 12 వరకు జరిగే స్వయం భూ శ్రీకేతెశ్వర జాతర కరపత్రాలను భూపాలపల్లి జిల్లా మేదరి సంఘము అధ్యక్షుడు గైని రమేష్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు జాతరకు అధిక సంఖ్యలో సందర్శకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి రేపాల శంకరయ్య, మండల ప్రధాన కార్యదర్శి రేపాల రాజశేఖర్, మంథని అధ్యక్షుడు రెడ్డి రాజయ్య, కాటారం కోశాధికారి రేపాల రాజేస్వర్, బాణయ్య, అశోక్, సారయ్య పాల్గొన్నారు.