కవిత బెయిల్ కోసం సోదరుడు చాలా తిప్పలు పడ్డాడు

Kavita's brother tried a lot for bail– కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి
నవతెలంగాణ – సిరిసిల్ల
ఇంత బయలు కోసం సోదరుడు కేటీఆర్ చాలా తిప్పలు పడ్డాడని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు సిరిసిల్లలోని బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే సర్వోత్తమ న్యాయస్థానం  166 రోజులు జైలో ఉన్న కవిత కు బెయిల్ ఇస్తే బిఆర్ఎస్ పార్టీ మాట్లాడిన తీరు బాదేస్తుందని ఆయన అన్నారు.కెసిఆర్ కూతురు కావడం వలనే ఎంపీ, ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని కవిత తెలుసుకోవాలన్నారు.తండ్రి కెసిఆర్ మందు తాగితే కూతురు కవిత లిక్కర్ అమ్మి జైల్ కి వెళ్లిందనే విషయం బి ఆర్ ఎస్ శ్రేణులు గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు.న్యాయం గెలిచింది అని అన్న మీరు ఇంతకు ముందు న్యాయం గెలవలేదా. అని ఆయన ప్రశ్నించారు.కవితకు బెయిల్ వస్తె దాన్ని బిఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తున్నారు.బిఆర్ఎస్ పార్టీ ఒక పావుగా కవిత ను వాడుకుంటున్నారు. ఈ బి ఆర్ ఎస్ నేతలు కాళేశ్వరం ను కూడా ఏటీఎం లాగా వాడుకున్న సందర్భాలు ఉన్నాయని ఆయన అన్నారు.కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తే బిజెపి, బిఆర్ఎస్ ఒకటే అని నిరూపణ అయ్యింది.రాజకీయ లబ్ధి కోసమే బిఆర్ఎస్ బీజేపీ వాడుకొని తెలంగాణలో 8 బిజెపి సీట్లు వచ్చాయి.కవిత జైల్లో ఉంటే అనేక సార్లు కేటీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చారు, అధికారంలో ఉన్నపుడు కూడా అన్నిసార్లు ఢిల్లీకి పోలేదని ఆయన పేర్కొన్నారు.కవిత బయటకు వచ్చిన సందర్భముగా సంబరాలు చేసుకుంటున్నారు.న్యాయ ప్రక్రియలో భాగంగా బెయిల్ వచ్చింది అంతే కానీ నేరం చేయలేదనీ రుజువు కాలేదని బి ఆర్ ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని అన్నారు. సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కాముని వనిత పట్టణ అధ్యక్షురాలు వేల్ముల స్వరూప గడ్డం నర్సయ్య వైద్య శివప్రసాద్ ఆకునూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.