బెయిల్‌ కోసం సుప్రీం కోర్టుకు కవిత

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో అరెస్టయి తీహార్‌ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్‌ రావు శుక్రవారం ములాఖాత్‌ అయ్యారు.. ఆమెతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని కోరారు.న్యాయవ్యవస్థపైన పూర్తి నమ్మకం ఉందనీ, త్వరలోనే బెయిల్‌ లభిస్తుందని భరోసా వ్యక్తం చేశారు. ఆమె బెయిల్‌ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు బీఆర్‌ఎస్‌ నేతలు తెలిపారు.