నవతెలంగాణ- బెజ్జంకి :
సాయం కావాలని వచ్చిన వారందరికి వైద్య సేవలందించి.. ఎటువంటి మచ్చలేని నాయకుడు కవ్వంపల్లి సత్యనారాయణను పార్టీలకతీతంగా గెలుపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు రంగోని రాజు ప్రజలను విజ్ఞప్తి చేశారు. మంగళవారం మండల పరిధిలోని దాచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల వివరాలను రంగోని రాజు గ్రామ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా పంపిణీ చేస్తూ ఈ ఎన్నికల్లో కవ్వంపల్లిని గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను విజ్ఞప్తి చేశాడు. గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.