నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద స్థానిక నాయకులు జెడ్పీటీసీ కమలా నరేష్, ఎంపీపీ లతా కన్నీరం, మండల అధ్యక్షుడు మోచ్చ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా బాజిరెడ్డి గోవర్ధన్ కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆయురారోగ్యాలతో ఉండాలని రానున్న రోజుల్లో ఇంకా ఉన్నత పదవులు పొందుతారని వారు ఆకాంక్షించారు .ఈ కార్యక్రమంలో న్యాల్కల్ శ్రీనివాసరావు, బాడ్సి సొసైటీ చైర్మన్ నిమ్మల మోహన్ రెడ్డి, మోపాల్ సొసైటీ చైర్మన్ ఉమాపతిరావు, మాజీ సర్పంచులు ఇందూరు సిద్ధార్థ, ముత్యం రెడ్డి, సాయి రెడ్డి లతా భూషణ్, ఎంపీటీసీ ముత్యన్న, జగదీష్ ,అజీమ్, కెంపు భూమయ్య, సుమన్ తదితరులు పాల్గొన్నారు