– కేటీఆర్, హరీశ్‌రావు, కవిత అందులో సభ్యులు : కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఎద్దేవా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో సంచరిస్తున్న చెడ్డీ గ్యాంగ్ లీడర్ కేసీఆరేననీ, హరీశ్‌రావు, కేటీఆర్, కవిత ఆ గ్యాంగ్‌లో సభ్యులుగా ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడితే తాటతీస్తాం…జాగ్రత్త అని హెచ్చరించారు. పదేండ్లపాటు రాష్ట్రాన్ని దోచుకున్న కల్వకుంట్ల కుటుంబమే పెద్ద చెడ్డీ గ్యాంగ్ అని విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రామ్మోహన్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు.చెడ్డీ గ్యాంగ్ అర్ధరాత్రి దొంగతనాలు చేస్తే కేసీఆర్ గ్యాంగ్ పట్టపగలు రాష్ట్రాన్ని దోచుకున్నదని ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ రావు కూడా సీఎం రేవంత్‌పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అడ్డదిడ్డంగా కమిషన్లు బొక్కి ఆ డబ్బు మదంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే కాళేశ్వరంలో హరీశ్‌రావు బాగోతం బయటపడబోతున్నదని హెచ్చరించారు.