మధు రాజీనామా వద్దు

మంథనిలో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ బీఆరెస్ నియోజకవర్గ ఇంచార్జ్ పుట్ట మధూకర్ ఆయన సతీమణి పుట్ట శైలజ తమ పదవులకు– వారించిన కేసీఆర్
నవ తెలంగాణ: మల్హర్ రావు

మంథనిలో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ బీఆరెస్ నియోజకవర్గ ఇంచార్జ్ పుట్ట మధూకర్ ఆయన సతీమణి పుట్ట శైలజ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించగా బీఆరెస్ అధినేత కేసీయార్ వారించి రాజీనామా ఆలోచనను విరమింప చేశారు. ఓటమి అనేది ఒక్క మంథనిలోనో పెద్దపల్లి జిల్లా పరిధిలోనో జరిగిన అంశం కాదని, ఓటమికి గల కారణాలను విశ్లేంచుకుని ముందుకు సాగాలని సూచించారు. కార్యకర్తలకు అండగా ఉండాలని, నైతిక బాధ్యత పేరుతో పదవులకు రాజీనామా చేయడం కాకుండా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వారి హామీల అమలుకు ఒత్తిడి తేవాలని కోరారు. కార్యకర్తలకు అండగా ఉండి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పెద్ద పదవిలో ఉన్న నువ్వే మూడు నియోజకవర్గాల కార్యకర్తలకు భరోసాగా నిలవాలని సముదాయించి రాజీనామా ఆలోచనను విరమింప చేసినట్లుగా తెలిసింది