– కేటీఆర్ బస్సుపై కోడి గుడ్లతో దాడి
– రంగంలోకి పోలీసులు
నవతెలంగాణ-నల్గొండటౌన్
నల్లగొండలో బీఆర్‌ఎస్ తలపెట్టిన మాజీ సీఎం కేసీఆర్ సభతో మంగళవారం కొంత ఉద్రిక్తత ఏర్పడింది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ప్రస్తుత ఎమ్మెల్యేలకు పట్టణంలోని గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాసానికి వచ్చారు. వారికి భోజనం ఏర్పాట్లు చేశారు. అది పూర్తి చేసుకుని సభా స్థలికి బస్సులో వెళ్తున్న సమయంలో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు హైదరాబాద్ రోడ్డులోని హౌటల్ మనోరమ ముందు అడ్డంగా వెళ్లారు. కేసీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నల్లటి దుస్తులు ధరించి కోడిగుడ్లతో దాడి చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఆందోళనకారులను స్టేషన్‌కు తరలించారు.