కేసీఆర్‌ ప్రభుత్వం అన్ని వర్గాలకూ సమ ప్రాధాన్యం..

– ఇదే కెసిఆర్ లక్ష్యం..
– లక్ష్మీ పుత్రులు గొల్ల కురుమ యాదవులు
– సబ్సిడీపై గొర్రెల పంపిణీతో ఉపాధికి ఊతం
–  ప్రజలే నా బలం.. నా బలగం.. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ 
నవతెలంగాణ- నిజామాబాద్ రూరల్ : కేసీఆర్‌ ప్రభుత్వం అన్ని వర్గాలకూ సమ ప్రాధాన్యం ఇస్తుందని, ఇదే కెసిఆర్ లక్ష్యం అని, లక్ష్మీ పుత్రులు గొల్ల కురుమ యాదవులు లోని, వారందరిని అందుకోవడానికి సబ్సిడీపై గొర్రెల పంపిణీతో వారందరికీ ఉపాధికి ఊతం ఇచ్చిందని, నిజామాబాద్ రూరల్ నీయోజకవర్గ ప్రజలే నా బలం, నా బలగమని ఏళ్ల వేళలో వారందరికీ అందుబాటులో ఉంటూ అబివృద్ధి కి బాటలు వేశారని మాజీ ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్  ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. శుక్రవారం డిచ్ పల్లి మండలంలోని నడ్పల్లి శివారులో ఉన్న  జి కన్వెన్షన్ ఫంక్షన్‌హాలులో నిజామాబాద్ జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు మహిపాల్ యాదవ్  అధ్యక్షతన రూరల్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు మద్దతుగా యాదవ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ హాజరై మాట్లాడారు. గొల్ల కుర్మలు ఆర్థికంగా వృద్ధి చెందాలనే ఉద్దేశంతో సబ్సిడీపై గొర్రెల పంపిణీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్  అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు, కుల వృత్తులను పట్టించుకున్న నాధుడే లేడు, తెలంగాణ సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నారన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లో యాదవుల కోసం కమ్యూనిటీ హాల్  చాలా నిర్మించుకోవడం జరిగింది అని ఆయన గుర్తు చేశారు,  మీరే మా నా బలం.. మీరే నా బలగం.. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లో ఉన్న ప్రజలంతా నా నా బలగం అని ఆయన గుర్తు చేశారు, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే అన్ని కులాలు, మతాల వారు సంతోషంగా ఉన్నారని అన్నారు. నిజామాబాద్ రూరల్ ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలను రెసిడెన్సి పాఠశాలను ఏర్పాటు చేసి ఒక్కొక్క విద్యార్థికి లక్ష ఇరవై ఐదు వేల  ఖర్చు చేసి నాణ్యమైన విద్యను అందిస్తుంది అని గుర్తు చేశారు, సంక్షేమంలో భాగంగా ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చాక విడుతల వారీగా ఆసరా పింఛన్లు రూ.5వేలకు పెంచుతామన్నారు. సంక్షేమం, అభివృద్ధి చూసి మరోసారి బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయాలని కోరారు.  కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ శ్రీ విజి గంగాధర్ గౌడ్ గారు, జిల్లా యువ నాయకులు జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు ధర్పల్లి జడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్, ఉమ్మడి జిల్లాల డిసిఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, చిల్లవ యాదవ సంఘం అధ్యక్షులు మహిపాల్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసయ్య , బీఆర్ఎస్ పార్టీ యాదవ సంఘం కార్యవర్గ సభ్యులు రాజారామ్ యాదవ్ , బీసీ నేత నాయకులు నరాల సుధాకర్ రావు, ప్రధాన కార్యదర్శి లింగం యాదవ్, మాజీ ఎంపీడీవో ఆంజనేయులు యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు ఉపసర్పంచులు ఎంపిటిసిలు, యాదవులు పాల్గొన్నారు.