
– జీపు యాత్రను జెండా ఊపి ప్రారంభించిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి
నవతెలంగాణ- కంటేశ్వర్
కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో జూలై 22 నుండి జూలై 30 వరకు విద్యారంగంలోని నెలకొన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలనే దిశగా జిల్లా వ్యాప్తంగా జీపు యాత్రను నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి న్యాల్కల్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో జెండా ఊపి జీపు యాత్రను ప్రారంభించి యాత్ర ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల ఆత్మా బలిదానాలతో ఏర్పాటు జరిగితే కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థులు కలలు కన్నా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తానని, అందరికీ కామన్ విద్యా విధానం అందుబాటులోకి తెస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చాలని జీపుయాత్ర ముఖ్య ఉద్దేశమని అన్నారు. అదేవిధంగా గత నాలుగు సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న 5117 కోట్ల స్కాలర్షిప్లను , ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన మెస్ చార్జీల ధరలను అమలు చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అన్నారు. మన ఊరు మనబడి పథకం కింద అన్ని పాఠశాలలను అభివృద్ధి చేయాలని విద్య రంగ బలోపేతం కోసం ఈ జీపు జాత జయప్రదం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విగ్నేష్, అనిల్ జిల్లా ఉపాధ్యక్షులు మహేష్, నాగరాజు జిల్లా సహాయ కార్యదర్శి శ్రీశైలం, రాష్ట్ర కమిటీ సభ్యురాలు దీపిక,జిల్లా నాయకులు జవహర్, నాయకులు శివ, సంధ్య బాబురావు, నితిన్ ఆ తదితర నాయకులు పాల్గొన్నారు.