నవతెలంగాణ -పెద్దవూర: ఇంటికోక ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగులను నిట్ట నిలువున ముంచిన ఘనత కేసీఆర్ అని సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జయవీర్ అన్నారు. ఆదివారం అనుముల మండలం లోని పలుగ్రామాల్లో ఎన్నికల ప్రచారం లో పాల్గొని మాట్లాడారు. గిరిజనుల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే జరిగిందని, బీఆర్ఎస్ గిరిజనులకు మీటర్ పెట్టి కరెంట్ బిల్లులు వసూలు చేస్తుందని, తండాలను గ్రామ పంచాయితీలుగా చేసి ఇల్లు బిల్లులు , నల్లా బిల్లులు వసూలు చేస్తూ, గిరిజనులను నయా వంచనీయంగ మోసం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో పేదలకు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిందని , పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న ఈ బీఆర్ఎస్ కనీసం డబుల్ బెడ్ రూమ్ ల పథకం ప్రారంభించి తండా కు ఒకటి కూడా ఇవ్వలేదని అన్నారు. అసెంబ్లీ, మీడియా సాక్షిగా గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని, గిరిజన బంధు ఇస్తానని, మోసం చేసిన బీఆర్ఎస్ కి ఓటు వేయొద్దని తెలిపారు. ఓట్లు అడగడానికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులను ప్రతి తండాలలో నిలదీసి అడగాలని కార్యకర్తలకు, గ్రామస్తులకు సూచించారు. కాంగ్రెస్ కి ప్రజా ఆదరణ ఊహించనంత అనూహ్యమైన స్పందన ఉందని, ప్రజలు బీఆర్ఎస్ మీద కోపంగా ఉన్నారని, నియోజకవర్గం ఏం ఎల్ ఏ అనుచరులు చేస్తున్న ప్రతి పనిని ప్రజలు గమనిస్తు,ప్రజలు విసుగు చెందారని తెలిపారు.