– టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి ఎద్దేవా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మాజీ సీఎం కేసీఆర్ తన ఇంటి పేరు కల్వకుంట్ల బదులుగా అబద్దాల కేసీఆర్ అని రాసుకోవాలంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. అబద్ధాల ప్రొపెసర్ కేసీఆర్ అని విమర్శించారు. ఆయన బాధ కరెంట్ గురించి కాదనీ, అధికారం కోసమని అన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నివాసంలో కెేసీఆర్ భోజనం చేసేటప్పుడు మూడు సార్లు కరెంట్ పోయిందంని చెబితే ఎవరూ నమ్మబోరని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఎట్లా జీవిస్తున్నారంటూ కేసీఆర్ ఎప్పుడైనా అడిగారా? అని నిలదీశారు. ప్రతిపక్షంలోకి వచ్చాకే ప్రజలు గుర్తొచ్చారా? అని ప్రశ్నించారు.