విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్

– ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
నవతెలంగాణ-వీణవంక
విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని వచ్చే ఎన్నికల్లో ఆయనను బలపరచాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చెరువుల పండుగ సందర్భంగా మండలంలోని వల్బాపూర్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మండల కేంద్రంతోపాటు దేశాయిపల్లి రెడ్డిపల్లి, చల్లురు గ్రామాల్లో చెరువుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు ఇంతగానో నీటి కష్టాలతో బాధపడ్డారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు గాని ప్రజలకు గాని నీటి కష్టాలు తీరాయని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ సమస్య గాని నీటి సమస్య గాని ఏ విధంగా పరిష్కరించాలో ముందుగానే ఆలోచించి నా ఒక విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ గారిని తెలియజేశారు. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతు కష్టాలను తీర్చిన రైతు బాంధవుడు కెసిఆర్ అని తెలియజేశారు. ప్రజల నీటి కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి గడపగడపకు మంచినీరు అందించిన మహా వ్యక్తి కెసిఆర్ గారిని తెలియజేశారు. రాష్ట్రం ఏర్పడక ముందు రైతులు తమ పండించిన ధాన్యాన్ని అమ్మడానికి దళారులతో మోసపోయేవారని, కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రైతు వద్ద నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బులను రైతు ఖాతాలో జమ చేస్తుందని ఇలాంటి ప్రభుత్వం దేశంలోనే ఎక్కడ లేదని పేర్కొన్నారు. రైతుబంధు పథకం ద్వారా రైతులకు ఎంతగానో మేలు జరుగుతున్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుక తిరుపతి రెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.