పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌

– సొంత పార్టీ నాయకులకే సంక్షేమ ఫలాలు
– విసుగెత్తిపోయిన రాష్ట్ర ప్రజలు
– వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం
– మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు సీతారాం సురేందర్‌ ముదిరాజ్‌
నవతెలంగాణ-పూడూర్‌
సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు సీతారాం సురేందర్‌ ముదిరాజ్‌ అన్నారు. శనివారం నవ తెలంగాణతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సం క్షమ ఫలాలు బీఆర్‌ఎస్‌ నాయకులకు కార్యకర్తలకు మా త్రమే అందుతున్నాయన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభు త్వంలో ఇందిరమ్మ ఇల్లు, సంక్షేమ పథకాలు రాజకీ యాలకతీతంగా పేద ప్రజలందరికీ అందే విధం గా కాంగ్రెస్‌ పరి పాలన కొనసాగిందన్నారు. బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన ఎంపీటీసీలకు సర్పంచులకు సమాచారం ఇవ్వకుండా బీఆర్‌ఎస్‌కు చెందిన నాయకులకే ఇస్తున్నారని విమర్శిం చారు. రాష్ట్రం కోసం ప్రజలు ఎంతో శ్రమించి ఉద్యమం చేశారని రాష్ట్రంలో ఉద్యమకారులకు సరైన గుర్తింపే లేదన్నారు. రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విలీనం చేస్తానన్న కేసీఆర్‌ రాష్ట్ర ఏర్పాటు చేయగానే రాష్ట్రంలో గద్దెనెక్కి కూర్చున్నాడన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం లేక కూలి పనులు చేసుకుంటు బతికే పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.