తండాలను గ్రామ పంచాయతీలగా మార్చిన ఘనత కేసీఆర్ దే

నవతెలంగాణ – మాక్లూర్ :
ప్రతి తాండాను గ్రామ పంచాయతీలు మార్చిన ఘనత కేసీఆర్ దేనని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కిందితాండ, సింగంపల్లి తండాలో ప్రజా ఆశీర్వాద యాత్రను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తండాలను గత ప్రభుత్వాలు గుర్తించలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి తాండాలను గ్రామ పంచాయతీలు మార్చారని అన్నారు. తండాలను సిసి రోడ్లు, డ్రైనేజీలు, నిర్మించామన్నారు. ఇదివరకు బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని, పథకాలను ప్రజలకు వారి మెని పేస్టో ను వివరించారు. మరో సారి తనను గెలిపిస్తే మరింత అభివృద్ది చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు పద్మ, రాథోడ్ గంగాధర్, ఎంపిపి మస్తా ప్రభాకర్, ఎంపిటిసి మీరాబాయి, జివన్న యువసేన అధ్యక్షులు రంజిత్, అమ్రద్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ రమణారావు, రజినిష్, రాజేశ్వర్ గౌడ్, మేదిడ గంగాధర్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.