నవతెలంగాణ – కంఠేశ్వర్
కౌశిక్ రెడ్డిని ముందుంచి కెసిఆర్ డ్రామాలాడుతున్నారని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు బిఆర్ఎస్ నాయకులు కౌశిక్ రెడ్డి చేసిన వాక్యాలను ఖండిస్తూ శుక్రవారం కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి కాంగ్రెస్ భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కెసిఆర్ తెలంగాణ వాసులకు ఇక్కడ సెటిల్ అయిన వారికి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ,కానీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎక్కడ కూడా భంగం కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిపాలన కొనసాగిస్తుందని దీనిని కేసీఆర్ గమనించాలని మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు సెటిలర్స్ కు సానుకూలంగా మాట్లాడిన కేసీఆర్ కౌశిక్ రెడ్డి విషయంలో అరికెపూడి గాంధీ నీ సెటిలర్ అంటూ మాట్లాడిన దాంట్లో మీరు ఎందుకు ఖండిస్తలేరని దాంట్లో మీ పాత్ర ఏందో చెప్పాలని మానాల మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు సెటిలర్స్ పైన సానుకూలంగా మాట్లాడిన కేసీఆర్ మాటలు నమ్మి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళందరూ టిఆర్ఎస్కు ఓట్లు వేసి గెలిపించారాని కానీ ఇప్పుడు కౌశిక్ రెడ్డి రూపంలో కేసీఆర్ రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నాడని మోహన్ రెడ్డి అన్నారు.కేటీఆర్ హరీష్ రావు ఎంత ప్రయత్నించిన రాష్ట్రంలో అల్లర్లు కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడుతుందని హరీష్ రావు పోలీసుల పైన చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని గడిచిన పది సంవత్సరాలు పోలీసులను బిఆర్ఎస్ నాయకులు ఆనిచివేశారని కానీ ఇప్పుడు పోలీసులకు ప్రజాస్వామ్యంగా పనిచేసే హక్కు లభించిందని ఆయన అన్నారు. అదేవిధంగా జిల్లాలో మంత్రి ప్రశాంత్ రెడ్డి నిన్నటి నుండి సన్నాయి నొక్కులు నోక్కుతున్నాడని కౌశిక్ రెడ్డి మాటలు సరైన వాని అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడని నిజంగా ప్రశాంత్ రెడ్డికి కౌశిక్ రెడ్డి వాక్యాలు సరైనవి అనిపిస్తే అది తమ పార్టీ నిర్ణయం మేరకే జరిగిందని బయటకి వచ్చి చెప్పాలని లేదంటే కేసీఆర్ దగ్గరికి వెళ్లి కౌశిక్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయించాలని మనలా మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బీన్దాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, జిల్లా ఎన్ఎస్యుఈ అధ్యక్షులు వేణు రాజ్ ,జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ మహేష్, అబుద్ బిన్ నందన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం ,హుస్సేన్ ,నిఖిల్, తదితరులు పాల్గొన్నారు.