యువజన సంఘాలకు కేసీఆర్ క్రికెట్ కిట్ల పంపిణి

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని బషీరాబాద్ లో పలు యువజన సంఘాలకు కేసీఆర్ క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ మేరకు శుక్రవారం  గ్రామ పంచాయతీలో కార్యాలయం ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో  సర్పంచ్ సక్కారం అశోక్  చేతుల మీదుగా గ్రామంలోని అన్ని యువజన సంఘ సభ్యులకు కేసీఆర్ క్రికెట్ కిట్ లను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ గ్రామ యువత క్రీడల్లో ఉన్నంతంగా రాణించడం ద్వారా గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. క్రీడలో రాణించడం ద్వారా కూడా ప్రభుత్వ ఉద్యోగాలను సాధించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. క్రీడల ద్వారా యువతలో స్నేహభావం పెంపొందుతుందని, శారీరకదారులు కలుగుతాయన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉపసర్పంచ్ కస్తూరి విక్రమ్, నెల్ల రమేష్, నారాయణ, యూత్ సభ్యులు పాల్గొన్నారు.