– రైతు సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి
– ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి
– పీఏసీఎస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కౌశిక్ రెడ్డి
నవతెలంగాణ-వీణవంక
రాబోయే కాలానికి కాబోయే ప్రధానమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని, ఇందు కోసం సీఎం కేసీఆర్ ప్రస్తుతం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలే నిదర్శనమని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మించతలపెట్టిన పీఏసీఎస్ భవన నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు చెప్పారు. రైతుల కోసం రెండు సార్లు రుణ మాఫీ చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి రైతు బీమా, రైతు బంధు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నట్లు తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా విద్యతు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. నూతనంగా నిర్మించే పీఏసీఎస్ భవనాన్ని రైతులు వినియోగించుకోవాలని సూచించారు. రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని, రాష్ట్రంలో ప్రతీ మండలానికి ఒక సొసైటీ భవనం ఉండాలని దేశంతో రూ.కోటి 40 లక్షలతో భవనంతో పాటు గోదాం నిర్మాణ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ మావురపు విజయ్ భాస్కర్ రెడ్డి, ఎంపీపీ రేణుక తిరుపతి రెడ్డి, జడ్పిటిసి మాడ వనమాల సాదవ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు రఘు పాల్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్లు కట్కూరి మధుసూదన్ రెడ్డి, గూటం సమ్మి రెడ్డి, కావ్య శ్రీనివాస్ రెడ్డి,రాములు, శ్రీనివాస్ రెడ్డి, సతీష్, సర్పంచులు నీల కుమారస్వామి ఎంపిటిసిలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.