బ్రాహ్మణులు, రైతుల కష్టాలను గుర్తించిన నేత కేేసీఆర్‌

– సమాజం మంచి పద్ధతుల్లో ఉండడానికి ఆధ్యాత్మికత అవసరం
– రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-చివ్వెంల
2014 కు ముందు పాలించిన పాలకుల హయాంలో నిరాదారణకు గురైన బ్రాహ్మణులను ,రైతులను గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆరే అని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. దురాజ్‌పల్లి సమీపంలో రూ 2.50 కోట్లతో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన చేసిన సభలో మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ, బ్రాహ్మణ సమాజ సంక్షేమాన్ని కాంక్షిస్తూ వారికోసం ఒక కేంద్రం ఏర్పాటు కావడం దేశంలోనే గోపనపల్లి తరువాత సూర్యాపేటదే తర్వాతి స్థానమన్నారు.అన్ని రంగాల మాదిరే బ్రాహ్మణ సంక్షేమంలోనూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పేదరికం ఎవరి జీవితాల్లో ఉన్నా వారిని ఆదు కోవాలనే మానవీయ సంక ల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పనిచేస్తున్నారని తెలి పారు.’తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌’ ను ఏర్పాటు చేసి,రూ.100 కోట్ల నిధులను కేటాయిస్తుందన్నారు. ఆధ్యా త్మికత నిలబెట్టిన గొప్పతనం బ్రాహ్మణ సమాజానిదేనన్నారు.సమాజం మంచి పద్ధతుల్లో ఉండాలంటే ఆధ్యాత్మికత ఎంతో అవసరం అన్నారు. 2014 కు ముందు ఆకలి కేకలతో అల్లాడుతున్న తెలంగాణ రాష్ట్రం నుండి ఆకలి కేకలను పారద్రోలిన ఘనత కేసీఆర్‌దేనన్నారు.మరోసారి కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్నారు. బ్రాహ్మణ సమాజమంతా విప్రహిత బ్రాహ్మణ సదన్‌ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో తోటి వారి కోసం ఖరీదైన ఎకరం భూమిని బ్రాహ్మణ సదనం భవనానికి ఇచ్చిన డాక్టర్‌ రామయ్య కుటుంబ సభ్యులు సమాజంలో ప్రతి ఒక్కరికి ఆదర్శం అన్నారు. రామయ్య కుటుంబ సభ్యులకు సూర్యాపేట నియోజకవర్గ ప్రజల తరఫున కతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌లో ఆలయాలకు పూర్వవైభవం వచ్చిందన్నారు. అర్చక ఉద్యోగులకు అత్యుత్తమైన వేతనం వ్యవస్థ ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ కి దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, బ్రాహ్మణ పరిషత్‌ చైర్మెన్‌,ప్రభుత్వ సలహాదారులు కేవీ.రమణాచారి, బ్రాహ్మణ పరిషత్‌ సభ్యులు సముద్రాల వేణుగోపాలచారి, సీఎం కేసీఆర్‌ చీఫ్‌ పీఆర్‌ఓ, బ్రాహ్మణ పరిషత్‌ వైస్‌చైర్మెన్‌ జ్వాలా నర్సింహారావు, కలెక్టర్‌ వెంకట్రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, గ్రంథాలయ చైర్మెన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.