– ఆర్థిక సహాయం కోసం బాలింతల ఎదురుచూపులు
నవతెలంగాణ – అచ్చంపేట
నవజాత శిష్యుల సంరక్షణ కోసం , గర్భిణీ మహిళలలో రక్తహీనత నివారించడానికి, బాలింతలకు పౌష్టికమైన ఆహారం తీసుకునేందుకు, ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రిలలో డెలివరీలు పెంచేందుకు గత ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా తీసుకొచ్చిన కేసీఆర్ కిట్టు పథకం ఉన్నట్టా…లేనట్టా… లబ్ధిదారులు సందిగ్ధంలో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పథకం పేరు మార్చైనా గర్భిణీలకు బాలింతలకు న్యాయం జరిగే మీ పథకాన్ని కొనసాగించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో 20 మండలాలు, 27 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేయించుకున్న మహిళలకు పదిహేను వేల రూపాయలు, 3 విడుదలవారీగా ప్రభుత్వం సహాయం అందిస్తుంది. బాలింతలకు, నవజాత శిశువులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడింది. 2022 నుంచి ఏప్రిల్ నుంచి ప్రభుత్వం ఈ పథకానికి నిధులు కేటాయించడం లేదు. నాగర్ కర్నూల్ జిల్లాలో 66,511 మంది ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేసుకున్నారు ప్రభుత్వం విడతల వారీగా అందించి ఆర్థిక సహాయం కోసం పేద మహిళలు బాలింతలు ఎదురుచూస్తున్నారు. పిల్లలు పుట్టి,3, 4 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఆర్థిక సహాయం అందడం లేదని బాలింతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పేదలకు లబ్ధి చేకూర్చే పథకం నిర్వీర్యం అయింది. జిల్లా వ్యాప్తంగా 19 కోట్ల 95 లక్షల 17,500 పెండింగ్ లో ఉన్నాయి. వైద్యాధికారులు నిధులు రాలేదని చేతులు ఎత్తేస్తున్నారు. డెలివరీ అయిన సందర్భంలో వైద్య సిబ్బంది బ్యాంకు ఖాతా వివరాలు తీసుకున్నారు. విడుదలవారీగా డబ్బులు అకౌంట్ లో తమ అవుతాయని తెలిపారు కానీ ఏళ్లుగా ఎదురుచూస్తున్న పడడం లేదని లబ్ధిదారులు తెలుస్తున్నారు.
కిట్టులో ఉండే వస్తువులు
బట్టలు, నాణ్యమైన బేబీ సబ్బులు, బేబీ ఆయిల్, బేబీ పౌడర్, దోమతెర, బొమ్మలు, న్యాప్‌కిన్‌లు, డైపర్‌లు 16 రకాల వస్తువులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం 2017-18 బడ్జెట్‌లో గర్భిణులు, నవజాత శిశువుల కోసం కేసీఆర్‌కిట్ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలు మరియు నవజాత శిశువులకు గర్భధారణసమస్యలను నిర్వహించడానికిఅవసరమైన కొన్ని వస్తువులతో కూడిన కిట్‌ను అందిస్తుంది. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందజేయడంతోపాటు ప్రసవం తర్వాత పుట్టిన బిడ్డల సంరక్షణ కోసం ఈపథకాన్ని రూపొందించారు.