ఐటీ హబ్‌లకు మూలం కేసీఆర్‌, కేటీఆర్‌లే

– దేశానికి రోల్‌ మోడల్‌ కేసీఆర్‌ విజన్‌
– అక్టోబర్‌ 2 న యువత కల నెరవేరబోతుంది
– ఐటీ హబ్‌ రావడం సంతోషకరం
– రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవ తెలంగాణ-సూర్యాపేట
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అయితే తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిన గొప్పతనం ఐటీ మంత్రి కేటీఆర్‌ది అని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఐటీి హబ్‌కు టాస్క్‌ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఎస్వీ కళాశాలలో ఐటీ కంపెనీలు నిర్వహించిన జాబ్‌మేళాలో ఆయన మాట్లాడారు.పట్టణ ప్రాంతాల్లో సైతం ఐటీ హబ్‌ ఏర్పాటుకు మూలం కేసీఆర్‌, కేటీఆర్‌లేనన్నారు.ఉద్యమ సమయంలో చేసిన ఉపన్యాసాలు నేడు నిజం అయ్యాయనితెలిపారు.2018 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఎన్నికల హామీ నెరవేర్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్‌ విజన్‌ దేశానికే రోల్‌మోడల్‌ అన్నారు.ప్రపంచ దేశాలను ప్రభావితం చేయగల విజ్ఞానం,పరిపాలన దక్షిత కేటీఆర్‌ సొంతమని పేర్కొన్నారు.దేశానికి ఐటీ మినిస్టర్‌ కేటీఆర్‌ అని ఇతర దేశస్థులు భావనే దీనికి నిదర్శనమని చెప్పారు. కేసీఆర్‌కు ఉన్న పరిపాలన దక్షతే దేశంలో ఐటీలో అగ్రస్థానంలో ఉన్న కర్నాటకను తెలంగాణ వెనక్కు నెట్టిందన్నారు.త్వరలో సూర్యాపేట యువత కల నెరవేర బోతుందన్నారు.ఇంటి దగ్గరే ఉండి ఐటీ ఉద్యోగం చేసుకునే అవకాశం సూర్యాపేట యువతకు దక్కబోతుందన్నారు.ఎన్నో ఆశలతో ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న గ్రామీణ ప్రాంతాల్లోని యువత కోసమే ఐటీ హబ్‌ను విస్తరించడానికి కారణమన్నారు.జాబ్‌మేళాకు వచ్చిన విశేష స్పందన దష్ట్యా మరోసారి జాబ్‌ మేళాను ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఐటీిలో హైదరాబాద్‌ తర్వాత స్థానం సూర్యాపేటే అన్నట్టుగా ఐటీ పరిశ్రమను అభివద్ధి చేస్తామన్నారు.రాబోయే ఐదేండ్లలో 5 వేల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఐటీని సూర్యాపేటలో విస్తరిస్తామన్నారు.అక్టోబర్‌ 2న సూర్యాపేట యువత కల నెరవేరబోతుందన్నారు. జాబ్‌మేళాలో ఉద్యోగాలు వచ్చిన వారు అదష్టవంతులైతే, రాని తమ నైపుణ్యాన్ని పెంచుకొని ఇంకా పెద్ద ఉద్యోగాలు సాధించడానికి వచ్చిన అవకాశంగా బావించాలన్నారు.
సకల సౌకర్యాల ఐటీ హబ్‌
సూర్యాపేట ఐటీి హబ్‌ నుండి తమ కార్యకలాపాల నిర్వహణకు అతి తక్కువ కాలంలోనే 15 కంపెనీల ముందుకు రావడం సంతోషదాయక మన్నారు. రాబోయే రోజుల్లో కంపెనీల సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు తీసిపోని విధంగా సకల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.24 గంటల భద్రత, సూర్యాపేట నుండి ఐడియా వరకు ఉచిత రవాణా సౌకర్యం, హై స్పీడ్‌ ఇంటర్నెట్‌, ఇలా సకల సౌకర్యాలు కల్పించే బాధ్యత తమ ప్రభుత్వానిదేనన్నారు.నిరుద్యోగ యువత ఐటీ రంగంలో నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి త్వరలోనే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ సెంటర్‌నూ ప్రారంభిస్తామన్నారు.తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ ల నడుమ వారధిలా ఉన్న సూర్యాపేటలో రాబోయే ఐటీ హబ్‌ రెండు రాష్ట్రాల ప్రజలకు తలమానికంగా నిలుస్తుందన్నారు.