ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్..

KCR made the rich state in debt.– ఎన్ని కష్టాలు వచ్చినా ఆదుకుంటున్న రేవంత్ రెడ్డి,
– రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ చేసిన ప్రభుత్వం జుక్కల్ ఎమ్మెల్యే
నవతెలంగాణ – మద్నూర్ 
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ధనిక రాష్ట్రంగా ఉంటే అలాంటి ధనిక రాష్ట్రాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల పాలు చేశారని ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని కష్టాలు వచ్చినా రాష్ట్రం అప్పులపాల్లో ఉన్నప్పటికీ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఆదుకుంటున్నారని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు అన్నారు. మెయిన్స్ కు అర్హత సాధించిన తెలంగాణ అభ్యర్థులకు చెక్కులు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. 135 మందికి ఒక్కొక్కరికి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించడం జరిగిందనిమెయిన్స్ లో ఉత్తీర్ణులై ఇంటర్వ్యూ కు అర్హత సాధించిన వారికి మళ్ళీ లక్ష సాయం అందస్తామని ప్రకటించిన సీఎం తెలిపారు. ప్రతిభకు ఆర్థిక కష్టాలు ఆటంకం కాకూడదని, లక్ష్య సాధనకు ఆత్మ విశ్వాసం కలిగించే విధంగా చర్యలు చేపట్టిన ప్రజా ప్రభుత్వం అని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు పేర్కొన్నారు.