15న ఎమ్మెల్యే అభ్యర్థులతో కేసీఆర్‌ సమావేశం..

KCR meeting with MLA candidates on 15.– అక్కడే అభ్యర్థులకు బీఫామ్స్‌
– అదేరోజున మ్యానిఫెస్టో, హుస్నాబాద్‌లో బహిరంగసభ
– నవంబర్‌ 9న గజ్వేల్‌, కామారెడ్డిలో నామినేషన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఈనెల 15వ తేదీన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణభవన్‌లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే అభ్యర్థులకు బీఫారాలను సీఎం కేసీఆర్‌ అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు తదితర అంశాలపై అభ్యర్థులకు ఆయన వివరిస్తారు. అదే సందర్భంలో బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు. అనంతరం అదే రోజున హైదరాబాద్‌ నుంచి బయలుదేరి, హుస్నా బాద్‌ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు.
సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటనలు
అక్టోబర్‌ 16 నాడు జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు.17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు.అక్టోబర్‌ 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో, అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్‌ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారు.
సీఎం కేసీఆర్‌ నామినేషన్లు
నవంబర్‌ 9వ తేదీన గజ్వేల్‌, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ వేయనున్నారు. ఇందులో భాగంగా 9వ తేదీ ఉదయం సిద్దిపేట నియోజకవ ర్గంలోని కోనాయపల్లి వెంకటే శ్వర స్వామి దేవాలయా నికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌ మొదటి నామినేషన్‌ వేస్తారు.మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండవ నామినేషన్‌ వేస్తారు. అనంతరం మూడు గంటల నుంచి ప్రారంభమయ్యే కామారెడ్డి బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు.