నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రముఖ తమిళ నటుడు డీఎండీకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్ మరణం పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. నటుడిగా కళారంగానికీ, రాజకీయ వేత్తగా ప్రజలకు, ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. విజయకాంత్‌తో కుటుంబసభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.