నిరుద్యోగులను మోసగించిన కేసీఆర్‌ : సచిన్‌ పైలట్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులను మోసం చేశారని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకులు సచిన్‌ పైలట్‌ విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నిరుద్యోగులతో ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆశలతో ఆవిర్భవించిన తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలను బీఆర్‌ఎస్‌ చిదిమేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియామకాలు జరపలేదనీ, నోటిఫికేషన్లు ఇచ్చినా పరీక్షలను సరిగ్గా నిర్వహించలేదనీ, ఐదేండ్లు గడిచినా నిరుద్యోగ భృ తి హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. పదేండ్ల తర్వాత సీఎం కేసీఆర్‌ మళ్లీ అవే సమస్యలను పరిష్కరిస్తానంటూ రావడం హాస్యాస్పదమన్నారు.
కర్ణాటక కార్మికశాఖ మంత్రి సంతోష్‌ ఎస్‌.లాడ్‌ మాట్లాడుతూ తాము గిగా వర్కర్ల (స్విగ్గీ తదితర ఆన్‌ లైన్‌ ప్లాట్‌ ఫాంలలో పని చేసే వారు) కోసం ఇచ్చిన గ్యారంటీని అమలు చేస్తున్నట్టు తెలిపారు. 50 లక్షల మంది దీంతో వైద్య, బీమా తదితర సౌకర్యాలు పొందుతున్నారని తెలిపారు.