
నవతెలంగాణ పెద్దవంగర: కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే రోల్ మోడల్ గా నిలిచాయని తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు అన్నారు. సోమవారం మండలంలోని వడ్డెకొత్తపల్లి గ్రామానికి చెందిన దంతాలపల్లి సతీష్ కు రూ.49 వేలు విలువచేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బంగారు తెలంగాణ నిర్మాణ దిశగా ప్రారంభమైన ఈ ప్రయాణం దేశానికే కాదు మానవ సమాజానికి ఎన్నో పాఠాలు నేర్పించిందన్నారు. సీఎం కేసీఆర్ దార్షనిక పాలన, ప్రగతి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజా జీవితాల్లో గుణాత్మకమైన మార్పు వచ్చిందన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాజనీతిని కనబరుస్తూ పనిచేస్తే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో తెలిపేందుకు తెలంగాణ ప్రగతి ఒక కొలమానమన్నారు. ప్రస్తుతం తెలంగాణలో సబ్బండ వర్గాల జీవితాల్లో వెళ్లి విరుస్తున్న సుఖసంతోషాలే అందుకు నిదర్శనమన్నారు. పేద బడుగు, బలహీనవర్గాల వారికి సీఎం రిలీఫ్ ఫండ్ వరమని పేర్కొన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకం అమలు చేస్తున్నారని, ప్రజలందరూ సీఎం రిలీఫ్ ఫండ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని పేదప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. బడుగు బలహీన వర్గల సంక్షేమానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్త్తుందని తెలిపారు. కార్యక్రమంలో కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముత్తినేని రమాదేవి శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తంగళ్ళపల్లి మల్లికార్జున చారి, ఉపసర్పంచ్ కొమ్మాల శ్రీనివాస్, కేశబోయిన కుమారస్వామి, బొల్లు ఉషయ్య, వెంకన్న, రవి, తదితరులు పాల్గొన్నారు.