గ్రామీణ ప్రాంతాలభివృద్ధే కేసీఆర్‌ లక్ష్యం

– ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌
నవతెలంగాణ-పెద్ద అడిశర్లపల్లి
మారుమూల గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అధికార వికేంద్రీకరణతోనే సాధ్యమని గిరిజన తండాలను, గూడాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌ కు దక్కుతుందని దేవరకొండ శాసనసభ్యులు, బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి రామావత్‌ రవీంద్ర కుమార్‌ నాయక్‌ అన్నారు. గురువారం వచ్చే నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మండలంలో రెండవ రోజు నంబాపురం,పెద్దగట్టు, పెద్ద గుమ్మడం, చింతల్‌ తండా, పుట్టంగండి, వద్దిపట్ల, నక్కల పెంట తండా, మల్లాపురం, యర్రగుంట తండా, అజ్మాపురం గ్రామపంచాయతీలలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రస్తుతం అమలవుతున్న రైతుబంధు,ఆసరా పింఛన్ల పెంపుతో పాటు వచ్చే ఎన్నికల్లో అదనంగా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా, సౌభాగ్య లక్ష్మి, చౌకధరల దుకాణాలలో సన్న బియ్యం పంపీణి,బీఇర్‌ఎస్‌ ప్పభుత్వం అభివద్ధికి పెద్దపీట వేసిందన్నారు.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై పలు గ్రామాలకు చెందిన విపక్ష నాయకులు పార్టీలో చేరిన వారికి బీఆర్‌ఎస్‌ కండువాలు కప్పి ఆహ్వానంచారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీఆర్‌ఎస్‌ నాయకులు కేతావత్‌ బీల్యానాయక్‌, ఎంపీపీ వంగాల ప్రతాపరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ వై. వల్లపరెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్‌,రేటినేని ముత్యంరావు, మాధవరావు ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.