
– వ్యక్తం అయిన అధికార లేమి…
– పరిమితంగా హాజరైన బీఆర్ఎస్ శ్రేణులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
నవతెలంగాణ – అశ్వారావుపేట
మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 70 వ పుట్టిన రోజు వేడుకలను శనివారం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మూడు రోడ్ల ప్రధాన కూడలిలో గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిర్వహించిన ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మెచ్చానాగేశ్వరరావు పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి భారీ బర్త్ డే కేక్ కట్ చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత మొదటి సారిగా నిర్వహించిన కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో అధికార లేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. పార్టీ శ్రేణులు సైతం పరిమిత సంఖ్యలో హాజరు అవడం దీనికి మంచి ఉదాహరణ గా పేర్కొనవచ్చు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.పీ శ్రీరామమూర్తి,పార్టీ అధికార ప్రతినిధి యు.ఎస్ ప్రకాశ్ రావు,సత్యవరుపు సంపూర్ణ,మందపాటి రాజమోహన్ రెడ్డి, వగ్గెల పూజ,డాక్టర్ భూక్యా ప్రసాద్,నారం రాజశేఖర్,చిప్పనపల్లి బజారయ్య,శ్రీను,ఉస్మాన్,హరి,ఆనంద్,ప్రసాద్,గోవింద్,శేకర్,రాంబాబు,తాండ్ర యుగంధర్,వెంకన్న బాబు,ధర్మ, చిన్న అబ్బాయి,సత్యనారాయణ,సూరి తదితరులు పాల్గొన్నారు.