
తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా శుక్రవారం బాబు జగ్జీవన్ రావ్ చౌరస్తా (రైతు బజార్ ఎదురుగా) వద్ద మాజీ శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య కేక్ కటింగ్ చేశారు. అనంతరం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జడల అమరేందర్ గౌడ్, కొలుపుల అమరేందర్, ఎన్నబోయిన ఆంజనేయులు, రాజేందర్ రెడ్డి, పట్టణ మండల అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, జనగాం పాండు, పట్టణ మండల ప్రధాన కార్యదర్శులు రచ్చ శ్రీనివాస్ రెడ్డి, నీల ఓం ప్రకాష్, వైస్ ఎంపీపీ సంజీవరెడ్డి, కంచి మల్లయ్య,కౌన్సిలర్ గోమారి సుధాకర్ రెడ్డి, పెంట నరసింహ, నువ్వుల సత్యనారాయణ,అబ్బగాని వెంకటేష్, సురపల్లి రమేష్, మందాడి జితేందర్ రెడ్డి,చెన్న మహేష్, తాడూరు బిక్షపతి, తాడెం రాజశేఖర్, ఇక్బాల్ చౌదరి, కాజం, బబులు, రహీం, మిరియాల శ్రీనివాస్, కొత్త ఆంజనేయులు,శాగంటి నరసింహ, గాదె శ్రీనివాస్,సుభాష్, ప్రవీణ్,పెంట నితీష్, నాగారం సూరజ్, పండు, సైదులు పాల్గొన్నారు.