– మాజీ ఎఫ్‌డీసీ చైర్మెన్ అనిల్ కుర్మాచలం
నవతెలంగాణ-హైదరాబాద్
మాజీ దేశ ప్రధాని, దివంగత పీవీ నరసింహరావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల ఎఫ్‌డీసీ మాజీ చైర్మెన్ అనిల్ కుర్మాచలం హర్షం వ్యక్తం చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషాకోవిదుడు, ఆర్థిక సంస్కరణల సృష్టికర్త అన్నింటికి మించి తెలంగాణ బిడ్డ కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు.
పీవీకి భారతరత్న రావడంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి గొప్పదని అభినందించారు. రాష్ట్రంలో పలు కార్యక్రమాల ద్వారా పీవీకి కేసీఆర్ సర్కారు ఘననివాళిని అర్పించిందని గుర్తు చేశారు. ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.